The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies

seeders: 10
leechers: 4
Added on February 26, 2016 by ashwanth.ashuin Movies > Asian
Torrent verified.



The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies (Size: 613.44 MB)
 The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies.mp4613.44 MB

Description

image

విడుదల తేదీ : 03 జూలై 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : నెల్లుట్ల ప్రవీణ్ చందర్
నిర్మాత : ఎర్రోజు వెంకటాచారి
సంగీతం : కాసర్ల శ్యామ్
నటీనటులు : రేయాన్ రాహుల్, నేహదేశ్ పాండే..

యంగ్ యాక్టర్ రేయాన్ రాహుల్ ని హీరోగా, నేహదేశ్ పాండే హీరోయిన్ గా నటించిన సినిమా ‘ది బెల్స్’. ‘జాగృతి కోసం’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రవీణ్ చందర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఓ మంచి సోషల్ మెసేజ్ ఉండేలా అన్ని అంశాలను జోడించి తీసాం అని చెప్పిన ‘ది బెల్స్’ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక హార్డ్ వేర్ కంపెనీలో చేస్తుంటాడు మన హీరో భరత్(రేయాన్ రాహుల్). స్వతహాగా భరత్ అన్ని పనులు న్యాయబద్దంగా జరగాలి, అలాగే ఎవరి పని వారు సక్రమంగా నిర్వహిస్తే సమాజంలో ఎలాంటి తప్పులు జరగవు అని నమ్మేవాడు. ఒకరోజు భరత్ స్వతంత్ర(నేహదేశ్ పాండే)ని చూసి ప్రేమలో పడడం, ఆ తర్వాత అది టూ సైడ్ లవ్ గా మారడం చకచకా జరిగిపోతాయ్. ఒకరోజు భరత్ ఫ్రెండ్ తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి విని చలించిపోతాడు. అప్పుడే తన ఫ్రెండ్స్ తో కలిసి ‘ది బెల్స్’ అనే వెల్ఫేర్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ ఫౌండేషన్ ద్వారా అమ్మాయిలకు రక్షణ కల్పిస్తూ కొన్ని సహాయక కార్యక్రమాలు చేస్తుంటారు.

భరత్ పెట్టిన ది బెల్స్ ఫౌండేషన్ కి మంచి గుర్తింపు రావడం వలన ఆ సిటీలోని అగ్గిరాం నాయుడు బిజినెస్ కి బాగా లాస్ వస్తుంది. దాంతో భరత్ ని ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాడు. ఇదిలా ఉంటే అదే టైంలో సిటీలోని పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, ఓ రౌడీ షీటర్ ఇలా పలువురు చంపబడుతూ ఉంటారు. కట్ చేస్తే సిటీ ఎసిపి రవికాంత్ ఆ హత్యలు చేస్తోంది భరత్ అని అరెస్ట్ చేస్తాడు. ఎసిపి మర్డర్స్ చేస్తోంది భరత్ ఏ అని ఎలా కనిపెట్టాడు.? అసలు నిజంగా ఆ మర్డర్స్ భరత్ చేసాడా లేకా ఇంకెవరన్నా చేసారా.? ఒకవేళ భరత్ కాకపోతే మరెవరు చేసారు.? అసలు ఆ మర్డర్స్ వెనకున్న అసలు కథ ఏమిటి.? అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి..

ప్లస్ పాయింట్స్ :

జాగృతి కోసం అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ‘ది బెల్స్’ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమా కథ ద్వారా డైరెక్టర్ చెప్పిన సోషల్ మెసేజ్. ‘మహిళలకి రక్షణ కల్పించాలి. దాని కోసం యువత నడుం బిగించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకోకుండా మన నుంచే మార్పు రావాలని’ అని చెప్పిన పాయింట్ బాగుంది. ఆ పాయింట్ ఆడియన్స్ ని ఆలోచించేలా చేస్తుంది.

ఇకపోతే హీరో రేయాన్ రాహుల్ తన పాత్రలో బాగానే చేసాడు. రెండు డిఫరెంట్ షేడ్స్ లో వేరియేషణ్ బాగానే చూపించాడు. ఇచ్చిన పాత్రలో రేయాన్ ఓకే అనిపించినా తన నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది. ఇక హీరోయిన్ నేహదేశ్ పాండే కి సినిమాలో పెద్ద ప్రాముఖ్యత లేదు, కాబట్టి పెర్ఫార్మన్స్ గురించి పెద్ద చెప్పలేను. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ అట్రాక్షన్ కోసం వాడుకున్నారు. పాటల్లో చూడటానికి బాగుంది. హీరో ఫ్రెండ్ గా చేసిన కమెడియన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఫస్ట్ హాఫ్ లో బాగానే నవ్విస్తాడు. అగ్గిరాం నాయుడు అనే విలన్ గా చేసిన యాక్టర్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

‘ది బెల్స్’ సినిమా కథలో చెప్పాలనుకున్న పాయింట్స్ రెండు, అందులో మొదటిది ఓ సోషల్ మెసేజ్, మరొకటి రివెంజ్ స్టొరీ. సోషల్ మెసేజ్ ని ఆసక్తికరంగా చెప్పకపోయినా మెసేజ్ మాత్రం రీచ్ చెయ్యగాలిగాడు. ఇక రివెంజ్ స్టొరీ చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటుంది. ఫస్ట్ నుండి సస్పెన్స్ గా చూపిన ఈ ఫ్లాష్ బ్యాక్ ని అందరూ ఊహించేయగలరు. దానికి తోడు ఆ ఎపిసోడ్ చాలా ఊహాజనితంగా ఉండడం వలన ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. అలాగే హీరో పాత్రతో రాసుకున్న ఒకే ఒక్క ట్విస్ట్ ని కూడా ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా చెప్పలేకపోయాడు. దానికి కారణం ట్విస్ట్ రివీల్ కి ముందే ట్విస్ట్ ఏంటనేది ఆడియన్స్ కి అర్థమయ్యేలా కొన్ని సీన్స్ లో చెప్పేయడం. దీనివల్ల కథలో ఉండాల్సిన కిక్ మొత్తం పోతుంది.

ఇక నెక్స్ట్ మేజర్ మైనస్ విషయానికి వస్తే.. ఇలా ఒకేసారి రెండు వేరు వేరు కథలతో కథని నడిపించాలి అంటే దానికి స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి. కానీ ఈ సినిమాకి అదే మైనస్. ఎక్కడా ఆసక్తికరంగా లేదు, అలాగే సీన్స్ ని సరైన పద్దతిలో ఎడిటింగ్ చేయలేదు. చాలా చోట్ల ఒక సీన్ ని మధ్యలో కట్ చేసి వేరే ఏదో సీన్ కి వెళ్ళిపోవడం ఆడియన్స్ కి కాస్త చిరాకు తెప్పిస్తుంది. అలాగే సినిమా నేరేషన్ కూడా ఏదో ముందుకు పోవాలంటే పోవాలి అన్నట్టు నత్తనడకలా స్లోగా సాగుతుంది. అంతే కాకుండా కామన్ ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అనే అంశం అస్సలు లేకపోవడం మరో మైనస్.

ఇక 144 నిమిషాల ఈ సినిమ రన్ టైం కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. సినిమాలో కమర్షియల్ అనే పాయింట్ కోసం పెట్టిన నవసరపు కామెడీ సీన్స్, సాంగ్స్ అన్నిటినీ కట్ చేసి 120 నిమిషాల సినిమాగా వచ్చి ఉంటే ఈ సినిమా ఆడియన్స్ కి ఇంకాస్త బెటర్ ఫీలింగ్ ఇచ్చేది. సినిమాకి ప్రధాన బలమైన ఒక్క పాత్రను కూడా సరిగా ఎలివేట్ చెయ్యలేదు. అలాగే లాజికల్ గా చూసుకుంటే చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఏ డిపార్ట్ మెంట్ వర్క్ చెప్పుకునే స్థాయిలో లేదు. అందరి వర్క్ అంతతమాత్రంగానే ఉంది. ఉదయ్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఓవరాల్ గా నాలుగైదు సీన్స్ లో బాగుంది అనిపిస్తుంది, మిగతా అంతా అలా అలా ఉంటుంది. ఇక కాసర్ల శ్యామ్ టైటిల్ కి జస్టిఫికేషన్ చెయ్యాలని మ్యూజిక్ కొట్టినట్టున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మనకు ఎక్కువగా గంట సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఇక పాటల గురించి చెప్పనే అవసరం లేదు. రీ రికార్డింగ్ సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. శేఖర్ విఖ్యాత్ కథా సహకారం పెద్దగా సాయపడలేదు. అలాగే అతని డైలాగ్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. కామెడీ కోసం డబుల్ మీనింగ్ డైలాగ్స్ వైపు వెళ్ళడం మెచ్చుకోదగిన విషయం కాదు. ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఈజీగా 25 నిమిషాల సినిమాని కట్ చేసెయ్యచ్చు.

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది ప్రవీణ్ చందర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఒక్క విభాగాన్ని కూడా ప్రవీణ్ సరిగా డీల్ చెయ్యలేదు. స్టొరీ లైన్ బాగుంది, కానీ కథా విస్తరణ సరిగా లేదు, అలాగే ఆసక్తికర స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. అలాగే డైరెక్టర్ గా మెచ్యూరిటీ లేకపోవడం వలన చాల చోట్ల తడబాటు కనిపిస్తుంది. దానివల్ల అనుకున్నది సరిగా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

తీర్పు :

ఈ వారం వచ్చిన పలు చిన్న సినిమాల్లో ఒకటిగా వచ్చిన ‘ది బెల్స్’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ‘జాగృతి కోసం’ అని పెట్టిన ట్యాగ్ లైన్ ని జస్టిఫై చేస్తూ ఈ సినిమాలో చెప్పిన సోషల్ మెసేజ్ మాత్రం బాగుంది. డైరెక్టర్ ప్రవీణ్ ఓ మెసేజ్ కి రెగ్యులర్ రివెంజ్ డ్రామాని జత చేసి చెప్పాలని ట్రై చేసాడు, కానీ అనుకున్న దానిని స్క్రీన్ పైన పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేయలేకపోయాడు. దాంతో ప్రేక్షకులు నిరుత్సాహపడతారు. చెప్పాలనుకున్న సోషల్ మెసేజ్, ఒకరిద్దరి పెర్ఫార్మన్స్, కొన్ని డబుల్ మీనింగ్ కామెడీ బిట్స్ ప్లస్ అయితే కథా విస్తరణ, స్క్రీన్ ప్లే, నేరేషన్, రన్ టైం, అనవసరపు సాంగ్స్, ఎడిటింగ్, నో ఎంటర్టైన్మెంట్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఫైనల్ గా ‘ది బెల్స్’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద గంట మోగించలేకపోయింది.


image

image

image

image

Sharing Widget


Download torrent
613.44 MB
seeders:10
leechers:4
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies

Screenshots


The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot
The Bells Telugu Latest Full Movie - 2016 Telugu Movies screenshot